Saturday, October 13, 2007

 

సాగే జీవన రాగం, అణువణువున "ఋతురాగం"....

Hello all,

This is about dreams unlimited. కలలు అనంతం, అన్నింటికీ అతీతం. పొట్టివాడు, పొట్టవాడు, నల్లవాడు, తెల్లవాడు, ఎవరైనా సరే; కలల లోకంలో ఎవరికి వారే రారాజులు. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నా, వాయువు మనకు అనుకూలంగా వీయకున్నా, మనదైన స్వప్నలోకంలో; సర్వం మనకు అనుకూలం, మనస్తాపం ఆమడ దూరం. కలలలో ఏదైనా సంభవమే, కమ్మనైనా అనుభవమే; కమ్ముకున్న కలికాలపు కష్ట, నష్టాలకు, దుష్ట దుఃఖాలకు కాసేపు దూరం కావడమే కలలకు ప్రాణం; అలసిన మనసును ఉత్తేజపరిచే కారణం, నిజం కాకపోయినా తరిగిపోని ఖనిజం...స్వప్నం. అటువంటి ఒక కల, ప్రాణం పోసుకుంది ఇలా....

తేనె చంద్రమా, తీపి సంద్రమా
చేతికి అందుమా, అంతులేని అందమా
సంగీతంలో గీతమా, రాగానుబంధమా
సందిట చేరుమా, అనురాగ బంధమా
ఏకాంతవేళలో శరత్తులో నవమి
చెంతనుండువేళ వసంత పంచమి
చెరిసగమైనవేళ జీవితం నిండు పున్నమి
సరిలేని గ్రీష్మ శిశిరాల అద్భుత కలిమి
హేమంత తుషారాలతో వర్షపు చెలిమి
కలగన్న 'ఋతురాగం' ఫలించాలి సుమీ!!!!

All the best and take care....

With thanks, regards and best wishes,
G.Srikanth.

Saturday, October 06, 2007

 

శ్రీకాంత్ సమర్పించు..."సుమాంజలి"...

Hi all,

'స్త్రీ'కి పర్యాయపదాలు; అతివ, వనిత, తరుణి, పడతి, కోమలి, ఇంకా ఎన్నో ఉన్నాయి. స్త్రీలను "కోమలి" అని అంటారు, కారణం వారు కోమలంగా/సుకుమారంగా ఉంటారని. అలాగే పువ్వులు కూడా సుకుమారమైనవి. పూలలో ఎన్నో రకాలున్నా అవన్నీ కూడా వేటికవి (వర్ణంలో, వాసనలో, వాడుకలో) వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. అలాంటి సుకుమారమైన పువ్వులను ఒక సుకుమారిని పోల్చడానికి ఉపమానాలుగా ఉపయోగిస్తే బాగుంటుందన్న ఆలోచన... ఈ కవితకు ప్రాణం మరియు ప్రేరణ. ఇందులో పది రకాల పువ్వులతో ఒక పడతి గుణాలను పోల్చి పుష్పాంజలితో అంకితం ఇచ్చాను, ఇలా....

గులాబీ ఛాయతో చెక్కిలి
మనసు మాయని సిరిమల్లి
తన నుదుటి సింధూరం
వికసించిన ఎర్ర మందారం

నాసిక సంపెంగ పువ్వంట
నయనాలు కలువ రేకుల జంట
ఇంతి వంటి నిగారింపు
బంతి, చామంతిల మేళవింపు

మొగలి సుమం తన పరిమళం
జఘన వయ్యారం నందివర్ధనం
తన తనువు నందనందనం
అణువణువు పుష్పాంగం
సుమ సుకుమారికి ఈ గీతం
సుమాంజలితో అంకితం....

All the best and take care....

With thanks, regards and best wishes,
G.Srikanth.

 

Srikanth's "సిరివెన్నెల".......

Hello all,

This is a poem which describes the 'best half' of every man's life. I guess, it will be unanimously agreed by all. Here it goes....

చీకటిలో చిరుదివ్వెలా
చిగురించిన మల్లెపువ్వులా
చెరగని చిరునవ్వులా
చలిమిడి ముద్ద బువ్వలా

జీవితంలో....
నిశీధిని నిర్మూలించి
ఆశలని గుబాళించి
ఆనందాన్ని ప్రతిఫలించి
ఆకలిని అమ్మలా తీర్చి

దరిని చేరావు, మదిన దూరావు
సరిజోడువై మేలు దారిని చూపావు
కరిమబ్బులు వీడిన నీలాల నింగిలో
సిరివెన్నెల వెలుగై వెంట నిలిచావు....

All the best and take care....

With thanks, regards and best wishes,
G.Srikanth.

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]