Thursday, April 08, 2010

 

వితండవాది...!

Hello All,

నా మదిలో తొలుస్తున్న ప్రశ్న, ఇలా నా పదాలలో...
వితండవాదం అంటే?

Birth days కి, Marriage days కి, New Year day కి, Valentine's day కి; అర్ధరాత్రి 12 వరకు కళ్ళు వాచేలా, కాయలు కాచేలా ఎదురు చూచే మనం/జనం; ఏడాదిలో ఏదో ఒక సాధారణ రోజు అదే logic ని ఒక్కసారి గుర్తుచేసి; రాత్రి 12 తరువాత తేది మారుతుంది కదా అని అడగడం... వితండమా?

కని, పెంచి, 20 ఏళ్ళు మన కట్ డ్రాయర్ తో సహా అన్నీ కొనిచ్చారని; మన మనసును కష్టపెట్టుకొని కళ్ళుమూసుకొని కన్నవాళ్ళు చూపించిన వారిని కట్టుకోవడం, నేరం అని ఆలోచించడం... వితండమా?

ఇతరుల సంతోషం కోసం పెళ్ళి చేసుకోవడం ఎంతవరకు సబబు? Parents ఉంటారు, పిల్లలు వస్తారు... కాని, Parents లేనప్పుడు వారి స్థానం తీసుకొని లాలించి, మనకు పిల్లలని కలిగించి మనలని పరిపూర్ణులను చేసే లైఫ్ 'Partner’ కి Priority ఇవ్వాలి, అని అనడం... వితండమా?
అసలు తల్లిదండ్రుల ప్రేమకి, జీవిత భాగస్వామి ప్రేమకి ఎందుకు పోలిక?
Is it not true that, marriage provides the most possible long relationship in life (barring all odds)??

Friendship కి అడ్డురాని జాతకాలు, Relationship కి ఎందుకు? స్నేహంగా వికసించి, ప్రేమగా పుష్పించి, పెళ్ళిగా ఫలించే బంధం... ఆ సంబంధానికి మనసులు కలిస్తే చాలు జాతకాలు కాదు అని అనడం... వితండమా?

అనుకూలతలను ఆలోచించకుండా, దేవుడు కొలువున్న నెలవు లోనే మనువు అనే 'శుభకార్యం' జరగాలి అని అన్నప్పుడు, ఆ తరువాత జరిగే 'సృష్టి కార్యం' అక్కడే జరుగకూడదా అని ఒక్కసారి అడగడం... వితండమా?
సప్తగిరుల ప్రయాణం కన్నా సప్తపదుల పయనం గొప్పది కదా.

సామాన్య మనిషి అవకాశవాది, లాభం లేకుండా ఏ పని చేయడు అని అంటున్నారు ఇప్పుడు. మానవత్వం ఇప్పుడు ఇదే ఐతే... దైవత్వం ఏమిటి? పూజలు, అభిషేకాలు, వ్రతాలు, నైవేద్యాలు లేకుండా దేవుడు కనికరించడు అంటే (హాస్యాస్పదం?)... ఇక దేవునికి, మనిషికి ఏంటి తేడా? ప్రతి మనిషిలో దేవుణ్ణి చూడాలని అంటారు... కాని ప్రతి దేవునిలోను ఇప్పటి మనిషే ఉన్నాడా? వస్తు సమర్పణలు లేకుండా మదినే దేవునికి అర్పిస్తే దేవుడు/దేవత కనికరించరా... అని అడగడం, వితండమా?


మనీ ఉంటుంది, పోతుంది... మళ్ళీ వస్తుంది. కాని మనుషులు ఉంటారు, పోతే... తిరిగి రారు. ధనాన్ని సంపాదించడం కన్నా, జనాన్ని సంపాదించడం ముఖ్యం, అని ఆలోచించడం... వితండమా?


Ofcourse, ఈ పైన చెప్పిన ఉదాహరణలను చదివిన వారిలో చాలామంది కూడా వ్రాసినవాడు కచ్చితంగా 'వితండవాది, మూర్ఖుడు, స్టుపిడ్, ఫూల్ (ఏప్రిల్ లోనే కాదు, ఏ నెలలో ఐనా)' అని అనుకోవచ్చు. అందుకు కారణం, వారి దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం లేక, ఇచ్చే తీరిక లేక, చెప్పే ఓపిక లేక, సంగతి అర్ధంకాలేక... మరేదైనా కావచ్చు. లేదా...
"తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు,
దవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు,
తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు,
చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు..."
అని చిన్నప్పుడు చదువుకున్న మంచిని గుర్తుచేసుకొని ఉండవచ్చు. కాని, ఆ పద్యపు ఆఖరి పాదాన్ని ఇక్కడ ఆపాదించే ముందు, ఇచ్చిన ఉదాహరణలు మొదటి మూడు పాదాలలో చెప్పినట్టివేనా అని ఒక్కసారి ఆలోచిస్తారుగా…

మనిషికి ఉండవలసిన ఓర్పు, నేర్పు, కూర్పు, మార్పు... ఎందుకవుతున్నాయి మరుపు? ఇది కాదా మనుగడకు చెరుపు? However; ఇది చెప్పినా, ఇన్ని వ్రాసినా; మానవత్వానికి నేను అతీతుణ్ణేమి కాదు, అంత హితుణ్ణేమి కాదు. సాధారణ మనిషినే... అయినా, వితండవాదినైన మాత్రాన నేను మనిషిని కాదా? నాకు మనసు ఉండదా? ఉండకూడదా?

సదా అందరికీ సఫలతను, సంతోషాన్ని కాంక్షిస్తూ...
With thanks, regards and best wishes,

With_and_vaadi… :)


This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]