Saturday, October 13, 2007

 

సాగే జీవన రాగం, అణువణువున "ఋతురాగం"....

Hello all,

This is about dreams unlimited. కలలు అనంతం, అన్నింటికీ అతీతం. పొట్టివాడు, పొట్టవాడు, నల్లవాడు, తెల్లవాడు, ఎవరైనా సరే; కలల లోకంలో ఎవరికి వారే రారాజులు. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నా, వాయువు మనకు అనుకూలంగా వీయకున్నా, మనదైన స్వప్నలోకంలో; సర్వం మనకు అనుకూలం, మనస్తాపం ఆమడ దూరం. కలలలో ఏదైనా సంభవమే, కమ్మనైనా అనుభవమే; కమ్ముకున్న కలికాలపు కష్ట, నష్టాలకు, దుష్ట దుఃఖాలకు కాసేపు దూరం కావడమే కలలకు ప్రాణం; అలసిన మనసును ఉత్తేజపరిచే కారణం, నిజం కాకపోయినా తరిగిపోని ఖనిజం...స్వప్నం. అటువంటి ఒక కల, ప్రాణం పోసుకుంది ఇలా....

తేనె చంద్రమా, తీపి సంద్రమా
చేతికి అందుమా, అంతులేని అందమా
సంగీతంలో గీతమా, రాగానుబంధమా
సందిట చేరుమా, అనురాగ బంధమా
ఏకాంతవేళలో శరత్తులో నవమి
చెంతనుండువేళ వసంత పంచమి
చెరిసగమైనవేళ జీవితం నిండు పున్నమి
సరిలేని గ్రీష్మ శిశిరాల అద్భుత కలిమి
హేమంత తుషారాలతో వర్షపు చెలిమి
కలగన్న 'ఋతురాగం' ఫలించాలి సుమీ!!!!

All the best and take care....

With thanks, regards and best wishes,
G.Srikanth.

Comments:
ఇలాంటి మంచి కవితలు ఎవరి కంట పడకుండా మరుగున పడి ఉండటం శోచనీయం. ఇక నుంచి ఇలా జరుగరాదు. నీవు వ్రాసిన ప్రతి టపా (పోశ్టు) వందల మంది వదివేలా చేస్తా. నీ బ్లాగుని కూడా కూడలిలో చేరుస్తా. (http://koodali.org).

తెలుగు బ్లాగర్ల గుంపులో వెంటనే చేరుతావని ఆశిస్తున్నాను. నేనెవరో చెప్పలేదు కదూ..మాదీ మదనపల్లే...నీ MIT blog google alert ద్వారా నాకు వస్తే..దాన్ని పెట్టుకొని..నీ బ్లాగుకు వచ్చా.
http://groups.google.com/group/telugublog/
 
అభినందనలు

జాన్ హైడ్ కనుమూరి
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]