Friday, November 11, 2022

 

అంజనమ్మ, వెంకయ్య గార్ల స్వర్ణోత్సవ వేడుక...

 

యాభై ఏళ్ళుగ కలిసి చూసిన వసంతం

కాదుకదా ఈ క్షణం అందరికి సొంతం

అమ్మగారి పాకం, అయ్యగారి పంతం

(అంజనమ్మగారి…), (వెంకయ్యగారి…)

కలిసి మెరిసి వెరసె అన్యోన్య దాంపత్యం.

వారి మురిపాల ముచ్చట్లకు మంచి ఫలితం

మారుతీయం, వనితా ద్వయం అనితాలతం

మన్నికైన ఎన్నికగా మనువాడిన శివం, శ్రీధరం

ఆ వరుల తోడుగ హరిహరులే జతకూడిన వైనం

అంజనాదేవి, వెంకయ్య గార్ల (ఖ)నిజ జీవితం!

అనితరం, అద్వితీయం, అద్భుతం, ఆసాంతం

వారిరువురి చేవ ఫలం, వరమైన దైవ బలం

కలిసి కలగలిసి లిఖించబడ్డ ఈ పుణ్య చరితం

కావాలి మనకు మనవలకు మనవాళ్ళకు ఆదర్శం

ఆది దంపతుల తీరుగ మిమ్ములను స్మరిస్తాం సతతం…

 

మీ వివాహ బంధం, స్వర్ణోత్సవ వేడుకకు హార్దిక శుభాకాంక్షలు

మీకు ఆయురారోగ్యాలు కలగాలని, ఆ రుద్రునికివే మా వేడికోలు…



Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]