Friday, November 11, 2022
అంజనమ్మ, వెంకయ్య గార్ల స్వర్ణోత్సవ వేడుక...
యాభై ఏళ్ళుగ కలిసి చూసిన వసంతం
కాదుకదా ఈ క్షణం అందరికి సొంతం
అమ్మగారి పాకం, అయ్యగారి పంతం
(అంజనమ్మగారి…), (వెంకయ్యగారి…)
కలిసి మెరిసి వెరసె అన్యోన్య దాంపత్యం.
వారి మురిపాల ముచ్చట్లకు మంచి ఫలితం
మారుతీయం, వనితా ద్వయం అనితాలతం
మన్నికైన ఎన్నికగా మనువాడిన శివం, శ్రీధరం
ఆ వరుల తోడుగ హరిహరులే జతకూడిన వైనం
అంజనాదేవి, వెంకయ్య గార్ల (ఖ)నిజ జీవితం!
అనితరం,
అద్వితీయం, అద్భుతం,
ఆసాంతం
వారిరువురి
చేవ ఫలం,
వరమైన దైవ
బలం
కలిసి
కలగలిసి లిఖించబడ్డ
ఈ పుణ్య
చరితం
కావాలి
మనకు మనవలకు
మనవాళ్ళకు ఆదర్శం
ఆది
దంపతుల తీరుగ
మిమ్ములను స్మరిస్తాం సతతం…
మీ
వివాహ బంధం,
స్వర్ణోత్సవ వేడుకకు హార్దిక
శుభాకాంక్షలు
మీకు
ఆయురారోగ్యాలు కలగాలని,
ఆ రుద్రునికివే
మా వేడికోలు…
Subscribe to Posts [Atom]