Friday, November 11, 2022

 

అంజనమ్మ, వెంకయ్య గార్ల స్వర్ణోత్సవ వేడుక...

 

యాభై ఏళ్ళుగ కలిసి చూసిన వసంతం

కాదుకదా క్షణం అందరికి సొంతం

అమ్మగారి పాకం, అయ్యగారి పంతం

(అంజనమ్మగారి…), (వెంకయ్యగారి…)

కలిసి మెరిసి వెరసె అన్యోన్య దాంపత్యం.

వారి మురిపాల ముచ్చట్లకు మంచి ఫలితం

మారుతీయం, వనితా ద్వయం అనితాలతం

మన్నికైన ఎన్నికగా మనువాడిన శివం, శ్రీధరం

వరుల తోడుగ హరిహరులే జతకూడిన వైనం

అంజనాదేవి, వెంకయ్య గార్ల ()నిజ జీవితం!

అనితరం, అద్వితీయం, అద్భుతం, ఆసాంతం

వారిరువురి చేవ ఫలం, వరమైన దైవ బలం

కలిసి కలగలిసి లిఖించబడ్డ పుణ్య చరితం

కావాలి మనకు మనవలకు మనవాళ్ళకు ఆదర్శం

ఆది దంపతుల తీరుగ మిమ్ములను స్మరిస్తాం సతతం…

 

మీ వివాహ బంధం, స్వర్ణోత్సవ వేడుకకు హార్దిక శుభాకాంక్షలు

మీకు ఆయురారోగ్యాలు కలగాలని, రుద్రునికివే మా వేడికోలు



This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]