Sunday, May 22, 2022
శ్రీవెంకయ్యగారికి జన్మదిన శుభాకాంక్షలు...
ఎనభయ్యోపడిలో
ఎలిగెంట్ అయ్య
ఏమరుపాటులేని
ఎలిఫెంట్ అయ్య
వృత్తిలో
ఎంతో ఎఫిషియెంట్ అయ్య
ప్రవృత్తిలోను
ఎత్తైన ఎవరెస్ట్ అయ్య
ఏళ్ళుపైబడ్డా
తీసుకోలేదు రెస్ట్ అయ్య
ఎదిగి
ఒదిగిన తీరులో ది బెస్ట్ అయ్య
తనవారిబాగులోనే
సదా ఇంట్రెస్ట్ అయ్య
పగవారంటూలేని
ఎవర్ హానెస్ట్ అయ్య
సగభాగంతో
సరిజోడుగా పర్ఫెక్ట్ అయ్య
సజ్జనసాంగత్యానికి
నిజరూపం శ్రీవెంకయ్య
వజ్రోత్సవం
పూర్తిచేసుకున్న వజ్రకాయమయ్య
వడివడిగా
వందోత్సవమూ జరుపుకోవాలయ్య
మీ
పుట్టినరోజు పండుగకు అందరూ అభిమానంతో కూడిరాగా
వారిని
ఆశీర్వదించి జన్మదిన శుభాభినందనలు అందుకోండయ్య
మీరు
నిండు నూరేళ్ళు ఇలా మెండుగ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో
అంజనమ్మ
జతగా ఇల ఆదిదంపతులవలె మాకు అండగా ఉండాలయ్య
మీకు
మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మామయ్య...
Subscribe to Posts [Atom]