Wednesday, July 20, 2016

 

కవి... కల్పన!

Hi All,
Greetings...

ఉరిమిన ఉత్సాహం, తరిమిన భావావేశం, మరోసారి... ఇలా...

తను శృతి, నేను స్వరం
తను కృతి, నేను రాగం
తను గతి, నేను ధృతి
తను జతి, నేను ద్యుతి
తను ప్రణవం, నేను నాదం
తను ప్రణయం, నేను మోదం
తను సవ్వడి, నేను స్పందన
తను మువ్వలు, నేను నర్తన
తను కీర్తన, నేను ఆలాపన
తను గొడుగు, నేను ఆలంబన
తను లోగిలి, నేను వెలుపల
తను జాబిలి, నేను వెన్నెల
తను వెలుగు, నేను వేకువ
తను శాంతి, నేను వెల్లువ
తను వేసవి, నేను చలువ
తను కొలను, నేను కలువ
తను వేణువు, నేను వాయువు
తను వీణియ, నేను క్రతువు
తను రవళి, నేను అడుగు
తను మరాళం, నేను మడుగు
తను పుడమి, నేను కడలి
తను పసిడి, నేను కంసాలి
తను పడవ, నేను చుక్కాని
తను కడవ, నేను నీటిని
తను మొగ్గ, నేను మాలి
తను ముగ్ధ, నేను కబాలి
తను కుసుమం, నేను భ్రమరం
తను అజరం, నేను అమరం
తను లయ, నేను అల
తను మాయ, నేను కల
తను భార్య, నేను భర్త
తను జాయ, నేను కర్త
తను చందనం, నేను చుబుకం
తను మృదులం, నేను శీతలం
తను చుంబనం, నేను అధరం
తను సౌమ్యం, నేను మధురం
తను భవ్యం, నేను జీవం
తను కావ్యం, నేను భావం
తను లత, నేను కొమ్మ
తను ఆత్మ, నేను బొమ్మ
తను రశ్మి, నేను జ్యోతి
తను రచన, నేను స్ఫూర్తి
తను కృప, నేను క్రాంతి
తను రాధ, నేను శ్రీపతి
తను దేవత, నేను స్తుతి
తను కోవెల, నేను హారతి
తను ప్రకృతి, నేను ఆకృతి
తను ప్రవల్లిక, నేను నివృతి
తను చదువరి, నేను మదుపరి
తను సొగ-సరి, నేను మగ-సిరి
తను మకరందం, నేను మోవి
తను మందారం, నేను తావి
తను కాంతి, నేను రవి
తను కల్పన, నేను కవి
తను మనసు, నేను తనువు
తను నేను, నేను... తను

With best wishes,
Kanth.

Comments:
Awesome
 
hahaha... nuvvu kathi thanu saamu...in front there is crocodile bonanza
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]