Thursday, August 21, 2014
అభినందన మందారమాల...
అభినందన మందారమాల,
అభిసారిక ఆగమన శుభవేళ...
అభిసారిక ఆగమన శుభవేళ...
తూరుపు పండిన సింధూరం
ఎరుపు నిండిన మందారం
తరుగు ఎరుగని బంగారం
మెరుగు పెట్టిన వయ్యారం
మెరుపు "వంటి" సౌజన్యం
చెరుపు మదిన మాలిన్యం
వన్నె తగ్గని ఔన్నత్యం
మన్ను అంటని సాన్నిత్యం
మిన్ను పట్టని కారుణ్యం
కన్ను కుట్టని సాఫల్యం
తన రూపం అపురూపం
కన గలమా సారూప్యం!
తరుణీమణి జన్మదిన శుభతరుణం
తనివితీర తనకీతీరున అభినందనం...
- Kanth.
Subscribe to Posts [Atom]