Wednesday, March 19, 2014

 

శ్రీకాంత్ యొక్క ఊహ...

Hi All,
Greetings...

Fantasy or Fiction, could be an Addiction, this is my Diction... శ్రీకాంత్ యొక్క ఊహ... తన వీక్షణకై నిరీక్షణ...


నల్లగ నిగనిగలాడు నిండైన ఒత్తైన జుట్టు
అల్లిన ఆ వాలుజడ ఉండాలి ఉరేసుకునేట్టు
చింతను చూపించనంటూ అగుపించే నుదురు
సింధూరపు శోభతో శుభమవ్వాలి ప్రతి ఎదురు
లోతైన భావాలను చూపించాలి అందాల కళ్ళు
పాలపుంతల పరిక్రమకు చెందాలి వాటి నకళ్ళు
పుడక లేక భాసిల్లు నా చెలి నాసిక
కోటేరు రూపుకు అది చూపాలి పోలిక
దానిమ్మ పండు గింజల పోలు పలువరుస
నవ్వులలో వాటి మెరుపు తెలిపే అప్సరస
రమ్యముగ నాట్యమాడే జత కమ్మలు
సౌమ్యముగ నిత్యం ధరించాలి కర్ణములు
చెంపల నునుసిగ్గులు, మదిలో పిల్లిమొగ్గలు
తాకినంతనే కందునేమో అ(క)నిపించే బుగ్గలు
వెన్నెలను తనలో నింపుకున్న వదనం
తన ముఖ వర్ఛస్సుతో వెలగాలి సదనం
తెల్లనైన నేమి, నల్లనైన నేమి తన మేను
చామనఛాయ వర్ణమైనా కాదననుకదా నేను
కమ్మని వంటను వండి, చెమ్మను మన కంటి నుండి
అమ్మగా ఆప్యాయతగా చేయాలి, తుడిచేయాలి చేతుల జోడి
గాజుల గలగలతో, తరాజుల నిపుణతతో చేయాలి అవి సందడి
గజ్జెలు ఘల్లనగ, గుండెలు ఝల్లనగ నడయాడాలి పాదాలు
సిరిమువ్వల చిరుసవ్వడుల అలరారాలి సదా ఇళ్ళు, వాకిళ్ళు
అన్నింటినిమించగ తేనెలలో ముంచగ తేలినట్టి మంచి మనస్సు
తన రవళితో, ఆలోచనా సరళితో తొలిగిపోవాలి రజస్సు, తమస్సు
అందరినీ ఆదరించగ, అన్నింటా మన్ననలొందగ విరియాలి ఇంద్రధనస్సు
కాళిదాసు వర్ణించిన కులధర్మపత్నికి గీటురాయికాగా నా సతి
తనకు పతినై, సన్మతినై పొందనా తనతో జతగా సంతతి, సద్గతి...
నా కల్పనకు ప్రతిరూపమై, స్వప్నముకు నిజరూపమై ఆ పడతి,
నా ఊహకు రుజువై, ఊసులకు ఊపిరై, ఎక్కడుందో సౌజన్యమూర్తి..!

All the best and take care...

With best wishes,
Kanth.

Comments:
Saati raadu neeku ye kavi...
 
This comment has been removed by the author.
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]