Wednesday, February 05, 2014

 

GSK 200 - Prasna... The P(i/u)nch?

Hi All,
Greetings...

దాదాపుగ ప్రతి ఒక్కరికీ తమ జీవన ప్రయాణంలో ఒకానొక సమయంలో ఎదురగు సంఘర్షణ... ఈ ప్రశ్న...?

ఏమి జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఎవరివల్ల జరిగింది?
అంతుచిక్కని ఆలోచనల అగాధాలలో, ఇంకిపోయే అశ్రువుల ఆ గాధలలో...
ఎవరిని అడగాలో అన్న సంశయంలో, ఎవరినీ అడగలేని వివసత్వంలో,
ప్రేమాభిమానాల పెనుగులాటలో, పరువుప్రతిష్ఠల పరుగుబాటలో,
లాభనష్టాల బేరీజులో, కష్టసుఖాల రివాజులో, హెచ్చుతగ్గుల తరాజులో,
సత్యాసత్య మీమాంసలో, తర్కవితర్క తర్జనలో, తలతెగని ప్రతివాదనలో,
ప్రయత్న లోపంలో, విఫల యత్నంలో, తరగని కోపంలో, తరిమే స్వప్నంలో,
కాల ప్రవాహంలో, వికల వివాహంలో, కన్నవారి కలహంలో, కనలేని వలయంలో,
విషయ విభేదంలో, విషపు ఖేదంలో, విలుప్త వినోదంలో, ప్రతప్త హృదయంలో...
ముల్లులా గుచ్చుకునే ప్రశ్న, ఝల్లుమని గుర్తుకొచ్చే ప్రశ్న, డొల్లతనం గుర్తుతెచ్చే ప్రశ్న,
వల్లకాని ఆత్మశోధన... ప్రశ్న, వదిలిపోని వేదన... ప్రశ్న, వినిపించని రోదన... ప్రశ్న??

నాది నావరకు ప్రతిఘటన, అది ఇతరులకు అతినటన!

ఔనన్నా మరి కాదన్నా, మొదలవును మరో... ప్రశ్న!?

With best wishes,
Kanth.

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]