Tuesday, February 25, 2014
The Italian Job...!
Hi All,
Greetings...
Ever wondered why Italy born Ms.Sonia agreed for Andhra Pradesh bifurcation into Telangana and Seemandhra...! Well, probably this should assist. The Italian effect on an Indian State... People say, 'Be a Roman in Rome'... She might have missed Rome, missed Italy; and so did this Italian Job. Now, we may have something similar to Rome in Our Home Country. Hari Om... Courtesy, 'Poly-ticks'..! Well, 'Poly' means 'Many' and 'Ticks' mean 'Insects/Parasites'... Hmm, may be apt for dirty 'Politics'...
Let us hope for the best...
With best wishes,
Kanth.
Wednesday, February 05, 2014
GSK 200 - Prasna... The P(i/u)nch?
Hi All,
Greetings...
Greetings...
దాదాపుగ ప్రతి ఒక్కరికీ తమ జీవన ప్రయాణంలో ఒకానొక సమయంలో ఎదురగు సంఘర్షణ... ఈ ప్రశ్న...?
ఏమి జరిగింది?
ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఎవరివల్ల జరిగింది?
అంతుచిక్కని
ఆలోచనల అగాధాలలో, ఇంకిపోయే అశ్రువుల ఆ గాధలలో...
ఎవరిని అడగాలో
అన్న సంశయంలో, ఎవరినీ అడగలేని వివసత్వంలో,
ప్రేమాభిమానాల
పెనుగులాటలో, పరువుప్రతిష్ఠల పరుగుబాటలో,
లాభనష్టాల
బేరీజులో, కష్టసుఖాల రివాజులో, హెచ్చుతగ్గుల తరాజులో,
సత్యాసత్య
మీమాంసలో, తర్కవితర్క తర్జనలో, తలతెగని ప్రతివాదనలో,
ప్రయత్న లోపంలో,
విఫల యత్నంలో, తరగని కోపంలో, తరిమే స్వప్నంలో,
కాల ప్రవాహంలో,
వికల వివాహంలో, కన్నవారి కలహంలో, కనలేని వలయంలో,
విషయ విభేదంలో,
విషపు ఖేదంలో, విలుప్త వినోదంలో, ప్రతప్త హృదయంలో...
ముల్లులా
గుచ్చుకునే ప్రశ్న, ఝల్లుమని గుర్తుకొచ్చే ప్రశ్న, డొల్లతనం గుర్తుతెచ్చే ప్రశ్న,
వల్లకాని
ఆత్మశోధన... ప్రశ్న, వదిలిపోని వేదన... ప్రశ్న, వినిపించని రోదన... ప్రశ్న??
నాది
నావరకు ప్రతిఘటన, అది ఇతరులకు అతినటన!
ఔనన్నా
మరి కాదన్నా, మొదలవును మరో... ప్రశ్న!?
With best wishes,
Kanth.
Subscribe to Posts [Atom]