Tuesday, December 10, 2013
సాక్షిగా నా మనస్సాక్షిగా...
Hi All,
Greetings...
ఇదో అనుభూతి, కాదో అనుభవం
నా మస్తిష్కంలోంచి, మరో ఉద్భవం...
వెండిపూత
వెన్నెల్లో తోడుగా
కుండపోత
వానల్లో గూడుగా
ఎండవేడిలో
వెన్నంటి నీడగా
అండదండగా
వెన్నుదన్నుగా
రెండు
కనుసన్నల్లో నిండుగా
నీ
మిన్నై నేనుండుగా
నే
మన్నైనా మన్నికగా
నీకై
మరలొస్తా నీ ఎన్నికగా
నీకే
మరులిస్తా నీ ఏలికగా
నీ
సాక్షిగా నా మనస్సాక్షిగా...
శ్రీకాంత్.
Subscribe to Posts [Atom]