Tuesday, November 19, 2013

 

నా గొంతు శృతిలో నీ గుండె లయ…

Hi,

Tu Meri Adhuri Pyas…
You are MUTEMy Unquenched Thirst Ever…
నా గొంతు శృతిలో నీ గుండె లయ…

నా స్మృతిలో కలిగెను కలకలం...
నా చేతిలో కదిలెను మళ్ళీ కలం, ఇలా...

నాకు చేరువైన స్నేహానివి, నాలో దూరమైన అహానివి
నేను కోరుకున్న మోహానివి, నువ్వు… నా తీరలేని దాహానివి…

నా పదాల అల్లికకు పొందికైన కూర్పువి
నా ఎదలో కదలికకు ఒద్దికైన మార్పువి
నా నిరంతర కలలకు కరిగిపోని నిద్రవి
నా ఙ్ఞాపకాల దొంతరలో చెరిగిపోని ముద్రవి
నా నింగిలో వెలిసి-పోయిన ఉషస్సువి
నా రంగులు కరిగిపోయిన హరిధనస్సువి
నువ్వు… నేను కోరుకున్న మోహానివి, నా తీరలేని దాహానివి…

నా జీవన వాహినిలో వలపుగ కనిపించి
నా మనసున వీణలు విరివిగ వినిపించి
నా మదిని మురిపించి మరులుగ వికసించి మరుగైన మెరుపువి
నా గొంతు శృతిలో నీ గుండె లయను పలికించి
నా వంతు ప్రేమకు నీ నుండి దయను చిలికించి
నా ఆశలు అహర్నిశలు ఆశీస్సులై పరిభ్రమించు తరగని తలపువి
నువ్వు… నేను కోరుకున్న మోహానివి, ఏ’నా’టికి తీరలేని దాహానివి…


శుభాకాంక్షలతో,
శ్రీకాంత్.

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]