Wednesday, August 21, 2013
నీ కోసం...
ఉదయపు సూర్యునిలో జ్వాల
నిండు పున్నమిలో వెన్నెల
తొలకరి జల్లులో తడిసిన నేల
పులకరించే పక్షుల కిలకిల
ప్రవహించే నీటిలో గలగల
పలకరించే కడలిలో ప్రతి అల
నిదురించే కన్నులలో తీపికల
కలహంస నడకలో గల కళ
దరహాసం చిందించే తళతళ
నీకై… నీవై ఉండాలని ఎల్లవేళల
అందిస్తున్నా నీకు నా శుభాకాంక్షల,
అభినందనలతో ఈ శుభవేళ…
- Kanth.
Subscribe to Posts [Atom]