Sunday, June 16, 2013

 

On Father's Day... About Our Father's Retirement

Our Dad, Sri Gadwal Eranna, retired after almost 37 years of continuous service, on 31st May'13. Below is a small tribute to him from we brothers... posted on Father's Day...

From Srikanth...

ఆర్టీసీతో దాదాపు మూడు పదులపై ఏడేళ్ళ నీ ప్రస్థానం
ఆ మూడు ముళ్ళ, ఏడడుగుల బంధం అంత ప్రధానం
ఊరినుంచి ఉరకలేసే ఉత్సాహంతో బ్రతుకుదారిని పట్టావు
భారీ భాగ్యనగర వీధులలో, నీ విధులను చేపట్టావు

భవిష్యత్తు వైపు బస్సుతో అడుగు వేసావు
బలమైన శ్రద్ధతో బలగానికి ఆదర్శమైనావు
వ్యవస్థలో మార్పు కోసం వ్యక్తిగా తపించావు
సంస్థలో కూర్పు కోసం శక్తిగా శ్రమించావు

సేద్యం కోసం స్వేదం చిందించే రైతువలె
పందెం కోసం ఊతం అందించే రౌతువలె
నీ ఆశనే ఒక అస్త్రంగా తలచి, చీకట్లను తొలచి
నిశ్వాసనే మరి శస్త్రంగా మలచి, ఇక్కట్లను గెలిచి

అన్ని కుదుపులను తట్టుకొని, అన్ని మలుపులను చుట్టుకొని
అన్నింటికీ నడుం కట్టుకొని, ఉడుం పట్టుతో నడిచావు
ఉయ్యాల వయసు నుంచి వియ్యాలందు వయసు వరకు
కయ్యాలు లేక, మంచి నెయ్యాలతో మనసు నెగ్గి నిలిచావు
కటువైన కాలంలోనా, ఎటువంటి సమయమైనా... గట్టి సంకల్ప బలంతో
కళామతల్లిని సైతం సేవించావు; నటనలో పటిమతో, వట్టిపోని కలంతో

సాధ్యం అయ్యేవరకు సాయం చేయడం తన ధ్యేయం
మంచితనానికి మరోపేరు, మా నాన్నగారి నామధేయం
చిన్న చిత్రాన్ని అద్భుతం చేసింది, తన హస్తాక్షరాల ప్రభావం (ఈగ)
... అది తన పేరుకున్న పవరు (శక్తి, కానేకాదిది అతిశయోక్తి)
కొన ఊరినుంచి మన రాజధాని చేరిన హాల్వీరగారి ప్రాభవం (ఈమెయిల్)
... ఎన్నటికీ కూలిపోని టవరు

నాన్నా! నీ మాట వసివాడని మరువం...
నీ బాటను ఎన్నడూ వీడం, మరువం...
ఈ యేడు ఐదవ నెలతుదకు నీ ఉద్యోగాస్తమయం
రాఱేడు వైన నీ జీవనశైలి, నిశిలేని ఉషోదయం...!

From Narendra...

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
మా నాన్న గద్వాల్ ఈరన్న ...

ఆయన గురించి ఇందాక మా అన్న కవిత రూపేణ వివరించాడు ...
మా భాషకు ఒక యాస, మాటకొక ప్రాస లభించిందంటే అదంతా మా నాన్నగారి చలవే
ఒక రైతుగా, రౌతు గా, ఒక  శక్తి గా పోల్చాడు ... యదార్థం ... అందులో అతిశయోక్తి ఏ మాత్రం లేదు ...

నేనెటువంటి ఉపమానాన్ని ఎంచుకోవాలో అని ఆలోచించగా సందర్భానుసారంగా నాకు సరయినదిగా అనిపించినది బస్సు...
నిజమే మా నాన్న జీవితాన్ని ఒక బస్సుతో పోల్చవచ్చు...
ఉన్నదాంతోనే వీలైనంత మందికి సాయం చేసే ఆయన KMPL కి జోహార్...
అందరు కలిసుండాలి అందరినీ కలుపుకుని పోవాలి అనే ఆయన OR కి మరొక్కమారు జోహార్...
బస్సులోలాగే ఆయన తన జీవితంలో పొగలాంటి హానికర పదార్థాలను రానివ్వలేదు...
పెద్దలకు, స్త్రీలకు ఎక్కడా గౌరవం తగ్గనివ్వలేదు...
ఈ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సురక్షితంగా గమ్యాన్ని చేర్చారు...

క్లుప్తంగా చెప్పాలంటే ... మా నాన్న ఒక గ్రామీణ బస్సు లా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఒక గరుడ బస్సు లా విరమిస్తున్నారు ...
కాని dad ... రిటైర్మెంట్ డ్రైవర్ లకే కాని బస్సులకు ఉండవు ...
నీ తదుపరి ప్రయాణం ఇంకెన్నో ఏళ్ళ మైళ్ళు సాఫీగా సాగాలని ఆశిస్తూ ......
పితృదేవోభవ ...!

From Saikrishna...

My Father taught me to practice honesty and passion in whatever I do.... All the very best Dad...!
Happy Father's Day...


Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]