Tuesday, August 21, 2012

 

ఎదలో... ఈవేళ!



ఎదలో ఒక మేఘం మెరిసెను ఈవేళ
ఏదో ఒక రాగం పలికెను లో లోపల
ప్రకృతిలో నేడు ఒక ఆనందహేల
పులకించెను తన స్పర్శతో ఈ నేల
కోయిలమ్మ కూసెను తీపిరాగాల
రేయిలోన పూసెను పండువెన్నెల
ఝుమ్మని గాలి పాడెను సప్తస్వరాల
కమ్మని లాలి పాటతో ఊపెనుయ్యాల
తూగుటూయలలో ఒక సుమబాల
జన్మదినానికి శుభాకాంక్షల మాల
అందిస్తూ... ఒక మేఘం మెరిసెను ఈవేళ
అందమైన ఒక రాగం పలికెను ఎద లోపల...

- Kanth.

Comments:
very nice srikanth garu
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]