Monday, May 02, 2011

 

Brother's last bachelor birthday party...

అనుంగు సోదరునకు,
జన్మదిన శుభాకాంక్ష​లు...
Have a great day and many happy returns of the day.
===================
ఏ యేటికి ఆ యేడు కొత్తదే మొదట
పిదప కదలి వదలి చేరును పడమట
తదుపరి కాలపు కడలి సుడులలో ఆడును దోబూచులాట
తన వెనుక వచ్చు సంవత్సరానికి చూపును సరి కొత్త బాట

ప్రతి యేటితో పాటు మన…

వయస్సు ముదురు అవుతుంది
ఆయుష్షు అరుదు అవుతుంది
మనస్సు పరిపక్వం అవుతుంది
ఉషస్సు పరిపూర్ణం అవుతుంది
ఛందస్సు కొత్తపుంతలు తొక్కుతుంది
మేధస్సు పాలపుంతలు దాటుతుంది

మరి వీటితో పాటు నీ...

వపుస్సు తేజోవంతమవ్వాలని
వర్ఛస్సు స్ఫూర్తిమంతమవ్వాలని
తపస్సు ఫలవంతమవ్వాలని
యశస్సు దిగంతమవ్వాలని
తమస్సు మాయం కావాలని
కార్యేషు జయం కలగాలని

మనసారా కోరుకుంటూ, శుభాకాంక్షలతో...
===================
With best wishes,
Kanth.

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]