Sunday, February 14, 2010

 

నా హృదయ సామ్రాజ్ఞి… My Dear Valentine...

రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక...
ఎవరైనా, వారి స్థానం నీ వెనుక
సాటి లేని సౌందర్యం నీది కనుక
అది చూసి అప్సరసలకూ కినుక

ముద్రలో నిత్యం నువ్వు శర్మిల
నిద్రలో సైతం నిండైన ఊర్మిళ
నినుచూసి ఆ వెన్నెల వెలవెల
కనలేని ఈ కన్నులు విలవిల

మదిని దోచు నీ నల్లని కురులు
మరులు కురిపించు మల్లెల విరులు
సరిలేని సమ్మోహనా ఝరులు
గిరుల చాటు దేవదారు తరులు

నెలవంక రూపం నీ చిరునగవు
నిండు పున్నమిని మోముగ కల దానవు
అందుకని ఆ జాబిలికి నీతో తగువు
నెలంతా వెన్నెల కురిపిస్తావని నీవు

తియ్యదనం చిందునది నీ వాణి
కొత్తదనం నిండినది నీ బాణి
లాభదాయకం జనులకు నీ బోణి
శుభప్రదం నీతో మనుగడ, నా రాణి!

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]