Tuesday, July 07, 2009

 

Please wake from making fake...

Hello All,
ఇది కేవలం పదాలు కలిగిన సంకలనం కాదు, ఒక మదిలో కలిగిన సంచలనం...
ఈ మధ్యకాలంలో ఈ-మాధ్యమంకన్నా త్వరగా పాకుతున్న కొత్త పోకడ... faking resumes or making of fake profiles/resumes/CVs. కూటికోసం కోటి విద్యలు... నిజమే. మన రోటి కోసం రొటీన్ కి భిన్నంగా ఆలోచించడం కూడా సబబే. కానీ, అన్నం కోసం కన్నం వేయడమే భిన్నం అనిపించుకోదు కదా! లేని దాన్ని, ఉందని చూపించడం; అది పక్కాగా ఉండడం కోసం పక్క దారులు పట్టడం చోరకళలోని పాఠమే.
Fake చెయ్యడంలో వివిధ రకాలు; Resume cook-up, make-up, touch-up... అందులో, మొత్తంగా మారుస్తున్న దాన్ని బట్టి, కొత్తగా చేరుస్తున్న దాన్ని బట్టి. కాని, పదం ఎక్కువైనా, పదం తక్కువైనా; పదార్థం యదార్థం ఐతే కాదుగా. నిజం అనే పునాది పైనే నమ్మకం నిలబడుతుంది, నమ్మకం తోటే జీవితం నడుస్తుంది; అసలైన సంతోషం లభిస్తుంది. డబ్బులు ఎక్కువగా రావాలంటే డబుల్ ఎక్స్పీరియెన్సు కావాలని, రియల్ క్విక్ గా రియల్ facts ని fake చెయ్యడం ఎంతవరకు సమంజసం! మన పుట్టుక, చదువు, అనుభవం, కాదేది fake కి అనర్హం అనే విషయం, విస్మయకరం. మనది కాని వ్యక్తిత్వం తో జీవించడం ఉఛ్ఛస్థితికి నిచ్చెన కాదు, దుస్థితికి మచ్చుతునక. ఇతరుల అవకాశాలను ఇలా fakeతో మనవి చేసుకోవడం, కన్నం వేయడంతో సమానం కాదా!
Fake చెయ్యడం సులువు కాదు. అందుకు ఎంతో ఆలోచన కావాలి, చాలా ధైర్యం కావాలి. కాని, అంత ధైర్యం, ఆలోచన ఉన్నవారికి నిజాయితి తోడైతే సాధించలేని కార్యం ఉంటుందా! ఎటువంటి చింతా లేని సంతోషకరమైన జీవితంకన్నా మించిన సంపాదన, నమ్మకానికి మించిన ఆస్తి, వేరే ఇంకేది! కంపెనీలు అడుగుతున్నాయని, మనం ఆ(అడ్డ)దారిలో వెళ్తున్నామని అనుకోవడం ఊరటే కానీ ఉపాయం కాదు. Freshers అంటే Field కి 'Fresh' అని అనుకోవాలి కాని 'Fresh' from college అని అనుకోవడం అనారోగ్య వాతావరణానికి కారణం. కంపెనీలు కాండిడేట్ల క్రెడిబిలిటీని చూసి ఉద్యోగంలో చేర్చుకోవడం నేర్చుకోవాలి. ఆ దిశగా మార్పు కోసం మనం నడుం కట్టాలి, కొంచెం ఓర్పు పట్టాలి. Software/IT తో పాటు teaching, banking, manufacturing, production industries, support/service field మరియు ప్రభుత్వ రంగాల్లో కూడా అవకాశాలు అనేకం ఉన్నాయి.
మన మనస్సాక్షిని మనం ఎదుర్కొని నిలబడేలా, ఎటువంటి విపత్కర పరిస్థితినైనా కలబడేలా చేయగల శక్తి, నిజాయితి. అది కలిగిన వ్యక్తికి ఎటువంటి అనవసర భయాలు ఉండవు. అలాంటి వ్యక్తులున్న సమాజానికి ఎటువంటి దురాచారాలు అంటవు. ఆరోగ్యకరమైన సమ సమాజ నిర్మాణం ప్రతి పౌరుని కర్తవ్యం. సమాజం కోసం చెయ్యాలన్న గొప్ప ఆలోచన ఉండకపోయినా; మనం నిజాయితీగా, నిర్భయంగా ఉండాలంటే ఇది కచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే, మన తరువాత తరానికి మనం మంచి సంస్కారాన్ని అందించాలి కాని వంచించే సంస్కారం కాదు.
ఈ ఒక్క వ్యాసం ద్వారా మొత్తం సమాజం ఒక్కసారిగా మారుతుందన్న గొప్ప ఆశ కాదు. కాని, ఎప్పటికైనా అటువంటి మార్పు వస్తుందన్న ఆశ; అందుకు నా వంతు ప్రయత్నం ఉందన్న సంతృప్తి ముఖ్యం. వేయి మైళ్ళ ప్రయాణమైనా మొదట వేసేది ఒక్క అడుగే. అడుగులు కలిస్తే మొదలు పరుగు, పరుగులు పెడితే దూరం తరుగు, తరిగిన దూరంతో నమ్మకం పెరుగు, నమ్మకం తోటే కలుగును గెలుపు, నిజమైన గెలుపు సదా హాయి గొలుపు. సాధించిన గెలుపును మనవాళ్ళతో కలిసి పంచుకోవటంలో కలిగే సంతోషం, అదే చేస్తుంది జీవితాన్ని విశేషం. ధనాన్ని కలిగి ఉండడం కన్నా జనాన్ని కలిగి ఉండడంలో ఉంది నిజమైన సంతోషం.
స్నేహితులారా... కొద్దిగా ఆలోచించమని మనవి. అందరికీ సద్బుధ్ధిని, సఫలతను, ఆయురారోగ్యాలను కోరుకుంటూ...
All the best and take care….
With thanks, regards and best wishes,
G.Srikanth.

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]