Sunday, June 21, 2009

 

నాన్న, నాకు ప్రేరణ....

Hello All,

నాన్నగారు చెప్పారండి... చిన్నప్పటి నుంచి, నిన్న-నేటి వరకు; ఎన్నెన్ని విషయాలు... అన్నింటిని అర్థవంతంగా, అద్భుతంగా, ఆసాంతం తెలిపారండి, నాన్నారు. బుడి, బుడి అడుగుల బుడుగు వయసు నుండి మనకు గొడుగులా వెన్నంటి నడిపించే వెండి వెన్నెల వెలుగు, నాన్న. ప్రకృతి ఒడిలోని జల ప్రవాహాల ఒరవడిని పరిపూర్ణ పురుషుడికి ఆపాదిస్తూ, "పితృదేవోభవ"కు ఫణి వంచి ప్రణమిల్లుతూ, ఇలా పితృదినోత్సవ శుభాకాంక్షలు అందిస్తున్నాను.

గంగలోని పవిత్రత, తుంగలోని తుళ్లింత
భద్రలోని భద్రత, కావేరిలోని కేరింత
నర్మదలోని నడత, సింధులోని సాంద్రత
సరయులోని రసజ్ఞత, మందాకినిలోని మంద్రత

కృష్ణలోని గిలిగింత, గోదావరిలోని చలి గోరంత
పెన్నలోని పులకింత, తపతిలోని తపన కొంత
అన్ని నదుల కలనేత, అన్నింటిని మించి కాస్తంత
సకలగుణాల సమాగమమైన, సగరునిలోని నిరాడంబరత
తనలో గల వ్యక్తి... నాన్న, మన ప్రేరణా శక్తి... నాన్న!
మన కలలను తన అలలపై తీరానికి చేర్చు ప్రత్యక్ష మూర్తి, నాన్న!!!

నాన్నారు, మీకు జోహారు....
Best wishes for a “Happy Father’s Day”....
Many many happy returns of the day.
All the best and take care….
With thanks, regards and best wishes,
G.Srikanth.

Comments:
Happy fathers day!
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]