Monday, October 20, 2008
విను వీధిన వెండి వెన్నెల....
Hello All,
మనిషిని మాత్రమే కాదు, మనసును సైతం తన మౌన వీణను మీటింపచేసే శక్తి కలది "ప్రకృతి". అందానికే అందాన్ని అద్దగల అద్భుతమైన అబ్బురపరిచే అపురూప ఆకృతి, ప్రకృతి. అటువంటి ప్రకృతిని చూసి ఒక మనసు, తన మనసు పారేసుకున్నది ఇలా....
విను వీధిన వెండి వెన్నెల
పరుండి చూసిన ఇసుక తిన్నెల
కొండ దారిన కన్నె వాగు గలగల
ఆహ్లాదపరుచు చిన్ని పక్షుల కిలకిల
ప్రకృతిలోని పలు వన్నె చిన్నెల
వర్ణ వర్ణనము చేయు వేళల
ఊరుకుండునా గుండె కోయిల
అది ఊగును హాయి ఊయల
పాట పాడును తీపి రాగాల...
"ఓ చల్లని రేయి ఉండిపో ఇలా
కరిగిపోకుమా నా తియ్యని కల
నువు జారిన నా మది ఆడును విలవిల!"
All the best and take care....
With thanks, regards and best wishes,
G.Srikanth.

Subscribe to Posts [Atom]