Saturday, July 19, 2008

 

నెలవంక తొంగిచూసింది....

Hello All,

ఇది పాత చిత్రంలోని పాట కాదు...కొత్తగా నేను కూర్చిన పదాల మూట...!
అందం అడవి కాచిన వెన్నెల అని మనం వింటూ ఉంటాం. కాని, ఆ అడవి కాచిన వెన్నెల ఎంత అందంగా ఆలోచిస్తుందో అన్న చిన్న ఆలోచన, ఈ కవితకు ప్రేరణ...

నింగి లోని నెలవంక,
తొంగిచూసె నేల వంక
కానలోన కృష్ణజింక...
కనులలో తన నీడ కనగ
కొలనులోన కలువ రెక్క...
విరబూసిన జాడ వినగ
మొగలి పొదల చాటు మాటున...
కోడె నాగుల క్రీడ జరుగ
వన్నెచిన్నెల కన్నె వాగున...
తను తానాలు ఆడు తీరుగ
నింగి లోని నెలవంక,
తొంగిచూసె నేల వంక...!

All the best and take care....

With thanks, regards and best wishes,
G.Srikanth.

Comments:
Awesome nice words nice thought
 
nice one, I was on tour to a moon lit forst reading your post. :-)
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]