Tuesday, January 01, 2008

 

Srikanth's "శుభోదయం".......

Hello all,

ఒక శుభోదయాన, జాలరులు తమ దినచర్యలో భాగంగా తమ జీవనోపాధి అయిన చేపల వేటకై బయలుదేరుతూ ఒకరినొకరు ఉత్సాహపరచుకోవడానికి పాడుకునే జానపద గీతాలలో ఒకటి...ఈ పాట, నిలిచింది ఈ చోట.....

పల్లవి: ఆకాశం వంగింది, ఈ కడలి పొంగింది
చిరుగాలి వీచింది, తెరచాప లేచింది/ఊగింది
హైలెస్సా ఓ లెస్సా హొ, హైలెస్సా ఓ లెస్సా
హైలెస్సా ఓ లెస్సా హొ, హైలెస్సా ఓ లెస్సా

చరణం 1: ఆ గాలి మా తండ్రి, ఈ ఏరు/నీరు మా తల్లి
ఆ మబ్బు మా యన్న/అన్న, ఈ కెరటం మా సెల్లి/చెల్లి

చరణం 2: అద్దరినీ వరిచేలు, ఇద్దరినీ కలిపింది
పాలపిట్ట గువ్వలంట, పావురాయి జంటలంట

చరణం 3: సొరచేపే చిక్కిందా, కొరమీనే దక్కిందా
వరమల్లే మన కోసం, వల/ఎరవేద్దాం తన కోసం

చరణం 4: అలలన్నీ మనవైతే, కలలన్నీ నిజమైతే
కన్నింటా సంతోషం, మిన్నంటే ఉల్లాసం
ఆనందం, ఆనందం, ఈ జీవితమే ఆనందం
ఆనందం, ఆనందం, ఈ జీవితమే ఆనందం.....

పల్లవి: ఆకాశం వంగింది, ఈ కడలి పొంగింది
చిరుగాలి వీచింది, తెరచాప లేచింది/ఊగింది
హైలెస్సా ఓ లెస్సా హొ, హైలెస్సా ఓ లెస్సా
హైలెస్సా ఓ లెస్సా హొ, హైలెస్సా ఓ లెస్సా.....

Wishing you all a very good morning every day......

All the best and take care....

With thanks, regards and best wishes,
G.Srikanth.

Comments:
watch www.ayaskaantham.blogspot.com
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]