Tuesday, December 18, 2007

 

బంధం...A RelationShip....

Hello all,

This is about a relation. Any relation stands firm only on the base of faith. ఒక బంధం ఏర్పడటానికి రెండు మనసులు కావాలి. ఆ బంధం బలపడటానికి ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఎందుకంటే, ఎటువంటి బంధమైనా అందుకు పునాది నమ్మకం; అదిలేనిదే నడవదు లోకంలో ఏ కొనుగోలు, అమ్మకం...

ఇద్దరి మధ్యన బంధం, ఇగిరి పోని గంధం...
అరిగిపోయే సబ్బులా, కరిగిపోయే మబ్బులా
తరిగిపోయే డబ్బులా, పెరిగిపోయే జబ్బులా కాదు..!

వెలిగే కాంతిలా, తొలిగే భ్రాంతిలా
కలిగే శాంతిలా, రగిలే క్రాంతిలా ఉండాలి...

బంధం యొక్క....
పునాదులు అరిగిపోకూడదు
కన్నకలలు కరిగిపోకూడదు
ఆనందపు అలలు తరిగిపోకూడదు
అలకలు, కలతలు పెరిగిపోకూడదు.

ఒక బంధం....
నిజమైన కాంతిలా వెలగాలి
నీచమైన భ్రాంతులు తొలగాలి
ఇరువురిలో శాంతి కలగాలి
ఇతరులలో క్రాంతి రగలాలి...

ఈ విధంగా ప్రతి బంధము మెలగాలి
సదా సాగాలి సుమ గంధపు చల్లగాలి...!

All the best and take great care...of your relationship....

With thanks, regards and best wishes,
G.Srikanth.

 

దేహమే దేవాలయం...Body is Temple....

Hello all,

This is about our body. Our body is a temple and we should take good care of its health because, health is the real wealth.

మనిషికి వరం కళ్ళు రెండు, కానీ వాటి చూపులో అర్థాలు మెండు
చెవులకు శక్తి వినికిడి, అవి తెలుపుతాయి ప్రతి చిన్న అలికిడి
మాటలకు ఆధారం నోరు, మనసులో భావాలకు అదేకదా డోరు
ముఖానికి అందం నాసిక, పసికడుతుంది ప్రతి వాసన యొక్క పుట్టుక
అన్నింటికీ తామే అంటాయి చేతులు, ప్రతిఫలిస్తాయి వాటిలో మన చేతలు
ముందుండి నడిపిస్తాయి నిండైన కాళ్ళు, దాటిస్తాయి దారిలోని నీళ్ళు, రాళ్ళు
ఆలోచనల పుట్ట మన మస్తిష్కం, మంచి ఆలోచనలకు ఉండాలి సదా వెల్కం
అన్నింటికీ మూలం నాడీ వ్యవస్థ, అది లేనిదే మనిషికి అంతా అవస్థ
విచిత్రమైనది ఆ దేవుని సృష్టి, అది నిలుపుకోవడానికి కావాలి కండపుష్టి
కష్టించి పనిచేయాలి ప్రతి మనిషి, నష్టాలులేక లాభాలతో పొందాలి ఖుషి..!

All the best and take good care...of your health....

With thanks, regards and best wishes,
G.Srikanth.

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]