Sunday, June 18, 2023
ఆత్మీయ కలయికలో నాన్నకు ప్రేమతో...
విశ్రాంతజీవిగ దశాబ్దము తిరుగ
షష్ఠిపూర్తిపై అష్టవసంతాల వేడుక
ఇష్టసఖితో ఇలవిశిష్టవ్యక్తుల నడుమ
శ్రీఈరన్నగారికి ఈ తీరున జరుగగ
ఇదివరకెవరు మరి కనీవినీ ఎరుగరుగ
మంచిపనికి శ్రీకారమే సుముహూర్తం
పంచగ పదుగురికి మమకారమే సుకృతం
మన మస్తిష్కంలో మనిషి కాకూడదు ద్రవ్యతుల్యం
జనజీవన స్రవంతిలో అనుబంధాలు కారాదు మృగ్యం
గడుస్తున్న కాలంలో, గతివిధుల గమనంలో
తోడునిలిచిన వారితో, గోడువినిన వారితో
అరుదైన వీక్షణం, ఆహ్లాదంగా ఒక్క క్షణం
కలుగుటకు, గడుపుటకు జరుగు నిరీక్షణం
కరములతో ఆపతగని కరుగుతున్న కాలాన
కాసేపు కలిమితోటి సేదతీరు ఈ కార్యక్రమాన
పాల్గొనవచ్చిన, పలుకరించతలచిన హితమిత్రులకు
కారణభూతులైన, కార్యరూపమిచ్చిన ప్రీతిపాత్రులకు
శిరసువంచి ఈ పదఝరితో పాదాభివందనం చేస్తూ
ఇటువంటి అపూర్వ కలయిక పరిపరి జరుప ఆశిస్తూ
ఇక్కడ విచ్చేసిన అందరికీ ఆయురారోగ్యాలు కాంక్షిస్తూ
ఇగిరిపోని సుమగంధమై ఈ సమయము, సంబరము, అస్తి
ప్రతిమదిలో తుదివరకు నిలిచిపోవాలని కోరుకుంటూ... స్వస్తి.
- On 01/06/2023 (Thu).
Subscribe to Posts [Atom]