Sunday, June 20, 2010

 

Wish you a very Happy Father's Day wishes....

Wish you a very Happy Father's Day wishes....

Sunday, June 06, 2010

 

నువ్వు - నేను...

నువ్వు నా దేవేరి, నేను నీ రథం
నువ్వు నా పయనం, నేను నీ పథం
నువ్వు నా ఊపిరి, నేను నీ రూపు
నువ్వు నా నయనం, నేను నీ చూపు
నువ్వు నా నారి, నేను నీ ధనువు
నువ్వు నా ఉనికి, నేను నీ తనువు
నువ్వు నా కవనం, నేను నీ జన్యువు
నువ్వు నా పవనం, నేను నీ వేణువు
నువ్వు నా ప్రాయం, నేను నీ ఆయువు
నువ్వు నా కాయం, నేను నీ వాయువు
నువ్వు నా తావి, నేను నీ పూవనం
నువ్వు నా జీవం, నేను నీ జీవనం
నువ్వు నా రశ్మి, నేను నీ మణిదీపం
నువ్వు నా లక్ష్మి, నేను నీ శ్రీనివాసం
నువ్వు నా రతి, నేను నీ మదనం
నువ్వు నా మతి, నేను నీ వదనం
నువ్వు నా శృతి, నేను నీ రాగం
నువ్వు నా కృతి, నేను నీ తానం
నువ్వు నా గమకం, నేను నీ గానం
నువ్వు నా ఇంధనం, నేను నీ వాహనం
నువ్వు నా గమనం, నేను నీ తుది గమ్యం
నీతో నా బంధనం, నేతికన్నా కడు రమ్యం
నువ్వు నా సౌజన్యం, నేను నీ ధనాగారం
నువ్వు లేని జీవితం, నాకు ఆజన్మ కారాగారం

నాకు నువ్వు, నీకు నేను; ఒకరికొకరం నువ్వు నేను
నువ్వు లేక నేను లేను; నీకోసం నేనున్నాను
వెన్నెలైనా, వేకువైనా; వేళదాటి వేళ అయినా
వేయి కన్నులతో నేను; నీకోసం వేచి ఉంటాను...!

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]