Monday, November 17, 2008

 

పదములు - పదనిసలు....

Hello All,
ఈ భూమిపైనున్న సమస్త ప్రాణికోటిలో ఉత్తమమైనది మానవజన్మ... అని అంటారు పెద్దలు. మనలాగే... మనుష్యుల్లాగే, ఇతర జీవులు; పశువులు, పక్షులు, వృక్షాలు కూడా మనసును, భావాలను కలిగి ఉంటాయి. అవి కూడా ఆలోచిస్తాయి, ఆచారాలను పాటిస్తాయి. మరి వాటికీ, మనకు మధ్య గల తేడా... భావవ్యక్తీకరణ. సంభాషించటానికి భాష ఉన్నా, భావాలను తెలియపరచటానికి సరైన మాటలు కావాలి, "పదములు/పదాలు" తెలియాలి. పెదాలతో పలికే పదాలతోనే మన మనుగడ పదిలంగా ఉంటుంది; పశుపక్ష్యాదులకన్నా మనుష్య జీవనం ఉత్తమంగా ఉంటుంది. మానవజన్మను ఉత్తమమైనదిగా నిలిపేటి "పదాల" మీద పదాలు పేర్చి ఈ పదబంధాన్ని కూర్చాను, ఈవిధంగా...
పదాలు అల్లితే ఒక పద్యం, పదాలు దొర్లితే ప్రసంగం
పదాలు కూర్చితే కథనం, పదాలు పేర్చితే పుస్తకం
పదాలు ఆలోచిస్తే పదబంధం, పదాలు గురుతుకువస్తే జ్ఞాపకం
పదాలు లేని జీవితం, పెదాలు లేని వికలాంగం
సదా తొలిచే సత్యం, నిలిచేను నిశ్శబ్దం
శూన్యం లోనే నిత్యం, సాగును పయనం
పదాలు పరబ్రహ్మ స్వరూపం,
పదాలు సరస్వతి దేవి వరం
పదాలు కడురమ్యం, కర్కశం, కఠోరం
పదాలు కమనీయం, అగమ్యగోచరం
పదాలు కలిగిస్తాయి భయం,
పదాలు ఇస్తాయి అభయం...
పదాలలో రకాలు భిన్నం
ఆలోచిస్తే కలుగును ఖిన్నం
అన్నం, సున్నం, కన్నం, సన్నం;
అన్నింటికీ ఉంది అర్ధం, పరమార్ధం.
అన్నింటా ఉన్నా సమానరూపం,
వాటి భావం, వాడుక అపురూపం...
భూత, భవిష్యత్తు, వర్తమానం...
ఏదైనా కావచ్చును కాలప్రవాహం
పదాల ఉపయోగం ఉంటుంది నిరతం
పదాలు సతతం, అవసరం అహరహం
పదాలు అనంతం, ఆసాంతం అద్భుతం
పదాలు లేని భూతజీవనం, పసలేని అభూతకల్పనం...
కావచ్చు చలికాలం, లేక కలికాలం
పదాలు నిలిచి ఉంటాయి కలకాలం...
ఆపాదించి చూస్తే మనం ఆపాదమస్తకం;
పదాలతోనే ఆరంభం, అంతం; ప్రతి జీవి(త) పుస్తకం.
సంగీతంలో సర్వం సప్త స్వరాలు... "సరి నిగమ పద" లు,
సంసార సాగరంలో సంక్షిప్త వరాలు, సరి అయిన నిగమాలు, "పదాలు"!!!
All the best and take care....
With thanks, regards and best wishes,
G.Srikanth.

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]