Friday, February 15, 2008

 

Srikanth's "పరిణీత" - A Married Woman....

Hello All,

సృష్టిలో 'స్త్రీ' పాత్ర విశిష్ఠమైనది. ఒక బుల్లిగా, చెల్లిగా, సిరిమల్లిగా, నెచ్చెలిగా, ఆలిగా, కాళిగా, తల్లిగా తన ప్రతి రూపం; అపురూపం, అద్వితీయం. పది నెలలు తన కడుపున మోసి మరో ప్రాణికి తన ప్రాణం సైతం పణంగా పెట్టి ప్రాణం పోసే పడతికి పలుమార్లు ప్రణమిల్లుతూ అందిస్తున్న నీరాజనం, ఈ "పరిణీత"కు నిర్వచనం....

తల్లి కడుపులో నృత్యం చేసే పసిపాప
తల్లిదండ్రులకు అత్యంత విలువైన కనుపాప
బారసాలకు ఊయలలో పాలబుగ్గల చిన్నారి
పెళ్ళినాడు పూలబుట్టలో సిగ్గుమొగ్గల వయ్యారి
మంటపాన బెల్లం, జీలకర్రతో సింగారించుకునే జవ్వని
తాళికట్టు శుభవేళ తలను వంచే తరుణీమణి
తలంబ్రాల తంతులో తలదన్నే ధీర సాహసనారి
తల్లి కాబోవువేళ తన్మయత్వంతో తల్లడిల్లే సుకుమారి
ఒడిలో బిడ్డను జోలతో ఓలలాడించే వనిత
పరిపూర్ణమైన అతివకు ప్రతీక, "పరిణీత"...!

Hats off to all Women in the World.....

All the best and take care....

With thanks, regards and best wishes,
G.Srikanth.

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]