Friday, November 30, 2007

 

నిజమైన ఆస్తి...నభూతో నభవిష్యతి....

Hello all,

ప్రతి మనిషికి జీవితంలో ఏదో సాధించాలని, ఎన్నో సంపాదించాలని ఆశ, ఆకాంక్ష ఉంటాయి. కాని,
జీవన చరమాంకంలో మనకు మిగిలే నిజమైన ఆస్తి;
కాలగమన చెరను వీడిన మన దేహాన్ని మోసే "ఆ నలుగురి" దోస్తి.
దానికి పెట్టుబడి మన మంచితనం, మచ్చలేని మస్తి.
అవి లేని ఆత్మకు దివిలో నరకమే తగిన శాస్తి......
దీని గురించి తెలిపే చిన్న ప్రయత్నమే ఈ "నభూతో నభవిష్యతి"...

జబ్బు పడ్డవేళ, డబ్బు ఎంత ఉన్నా ఉండదు ఆనందం
నా అనువారు లేని చోట, నాదను ఆస్తి ఎంత దాచినా లేదు లాభం
జబ్బు ముదిరి ప్రాణం మీదకు వస్తే, ఎంత డబ్బున్ననూ నిరుపయోగం
నా అనువారిని సంపాదించని జీవితాన, నాదని సంపాదించినదంతా నిష్ఫలం
అందుకే ఓ మనిషీ తెలుసుకో
తెలుసుకొని నేర్పుగా మసలుకో
మంచితనంతో నలుగురు మనుషులను సంపాదించుకో
మంచి వ్యక్తిగా నలుగురిలో మన్ననలు అందుకో
మన మంచితనం, మాయని స్నేహం ఇవే నిజమైన ఆస్తి
వీటికి సాటి జీవితాన "నభూతో నభవిష్యతి"....

All the best and take care....

With thanks, regards and best wishes,
G.Srikanth.

Thursday, November 29, 2007

 

"సరి సాటి లేని జోడు - 'సరిజోడు'...The Perfect Match"

Hello all,

This is about the perfect match for every person in life. ప్రతి మనిషి జీవితంలో మనువు ఒక మలుపు. కాని; అది మేలుమలుపు కావాలన్నా, జీవితాన మలిగెలుపు రావాలన్నా; మన గూడు చేరిన తోడు, కావాలి ఒక సరిజోడు. అపార్థాలకు అతీతంగా, అనర్థాలకు దూరంగా, అన్నింటినీ అర్థంచేసుకునే, అవసరానికి సర్దుకునే, మనువాడి మన తనువులో తను ఐక్యమై, అర్థభాగమై సదా నిలిచే తోడు - సరిజోడు. అటువంటి సరిజోడు గురించి ఈ పదకేళి, అటువంటి వారికి అందిస్తున్న పద నివాళి...

తోడు కరువై, కడుపు చెరువై
గుండె బరువై, ప్రమాదాన పరువై
ఉన్న సమయాలలో ఈ జీవితం...
నేనున్నాననే ఆసరా మనిషికెంతో అవసరం.
మన ఉనికిని కనిపెట్టుకొని నిరతం,
తన పనిని నెపమెన్నక చేయు స్నేహ హస్తం...
మనం ఎదురుచూడని ఉపకారం,
కనిపించని దేవుడు ఇచ్చిన వరం.
తోడులేని జీవనం, మోడులైన పూవనం...
సరిజోడు కుదిరిన క్షణం, వసంతమగును తక్షణం.
గూడుకట్టి పాడును కోకిల గానం,
జోడికట్టి ఆడును నెమలి నాట్యం...
ఇదేకదా సదా నిలుచు జీవిత సత్యం,
"సరిజోడు" తోనే సర్దుకుంటుంది జీవితం నిత్యం!!!!

All the best and take care....

With thanks, regards and best wishes,
G.Srikanth.

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]